Konda Surekha: కొండా సురేఖ వ్యాఖ్యలపై ప్రకంపనలు

Konda Surekha: కొండా సురేఖ వ్యాఖ్యలపై ప్రకంపనలు
X
మంత్రిగా ఇవేం వ్యాఖ్యలంటూ భగ్గుమన్న టాలీవుడ్... లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్

నాగ చైతన్య-సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. సినీనటి సమంత విడాకులు, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ పెళ్లి, డ్రగ్స్, ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాలను లేవనెత్తుతూ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బాధ్యతగల మంత్రి హోదాలో ఉన్న ఆమె.. నైతికతను పట్టించుకోకుండా అక్కినేని నాగార్జున కుటుంబంపై ఆక్షేపణీయ వ్యాఖ్యలు చేయడం, దానికి కేటీఆర్‌ బాధ్యుడంటూ ఆరోపణలు చేయడంతో కలకలం మొదలైంది. రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతున్నారు. రాజకీయపరమైన వివాదాల్లోకి సంబంధం లేని ఓ కుటుంబ అంతర్గత వ్యవహారాన్ని లాగడం, ఉచితానుచితాలను పట్టించుకోకుండా ఇష్టం వచ్చిన ఆరోపణలు చేయడం సరికాదని మండిపడుతున్నారు. తెలంగాణలో మహిళలంతా సంబురంగా జరుపుకొనే బతుకమ్మ పండుగ వేళ.. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు, మహిళలే ఆక్షేపణీయ విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

సీఎం స్పందిస్తారా

సమంతపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శల జల్లు కురుస్తోంది. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని ఇప్పటికే కేటీఆర్.. కొండా సురేఖకు లీగల్ నోటీసులు కూడా పంపారు. మరో వైపు టాలీవుడ్ ప్రముఖులు కూడా దీనిపై భగ్గుమంటున్నారు. ఇప్పుడు ఈ వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అసలు ఈ అంశంపై సీఎం స్పందిస్తారా.. లేక మౌనంగా ఉంటారా అన్న చర్చ జరుగుతోంది.


ఆత్మరక్షణలో కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడిపోయింది. హైడ్రాపై దూకుడుగా వ్యవహరిస్తూ బీఆర్‌‌ఎస్‌తో సై అంటే సై అన్న కాంగ్రెస్ పార్టీ.. కొండా సురేఖ వ్యాఖ్యలపై ఎలా స్పందించాలో తెలియక సతమతమవుతోంది. మంత్రిగా ఉన్న సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ ఘాటుగా స్పందిస్తుండడంతో హస్తం పార్టీకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. నాగ చైతన్య-సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడిపోయింది. హైడ్రాపై దూకుడుగా వ్యవహరిస్తూ బీఆర్‌‌ఎస్‌తో సై అంటే సై అన్న కాంగ్రెస్ పార్టీ.. కొండా సురేఖ వ్యాఖ్యలపై ఎలా స్పందించాలో తెలియక సతమతమవుతోంది. మంత్రిగా ఉన్న సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ ఘాటుగా స్పందిస్తుండడంతో హస్తం పార్టీకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇది బీఆర్‌‌ఎస్‌ అనుకూలంగా మారుతోందని టాక్.

ఘాటుగా స్పందించిన అమల

నాగ చైతన్య-సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై.. అక్కినేని అమల ఘాటుగా స్పందించారు. మంత్రిగా ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు సిగ్గుపడాలని.. ఆ వ్యాఖ్యలు తనకు చాలా బాధ కలిగించాయని అన్నారు. మంత్రిగా ఉన్న మహిళే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే దేశం ఏమై పోతుందని అమల ప్రశ్నించారు. రాజకీయ వివాదాల్లోకి తమ కుటుంబాన్ని లాగడం సరికాదన్నారు. మంత్రి తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Tags

Next Story