BALAYYA: తిరుమల తొక్కిసలాట బాధాకరం

BALAYYA: తిరుమల తొక్కిసలాట బాధాకరం
X
తనను ఎంతో బాధించిందన్న బాలకృష్ణ

తిరుపతిలో తొక్కిసలాట ఘటన చాలా బాధాకరమని.. ఆ దుర్ఘటన తనను ఎంతో బాధించిందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే అనంతపురంలో నిర్వహించాల్సిన డాకు మహరాజ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేశామన్నారు. ఆ ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని... వారి కుటుంబ సభ్యులకు తమ చిత్ర బృందం తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాని అన్నారు. . ఈ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. జరగకూడని ఘటన జరిగిందన్నారు.

అందుకే రద్దు చేశాం..

బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన 'డాకు మహారాజ్' చిత్రం సంక్రాంతి సందర్భంగా రేపు విడుదలవుతోంది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ మొదట అనంతపురంలో నిర్వహించాలని భావించామని, తిరుపతి ఘటన నేపథ్యంలో అక్కడి ఈవెంట్‌ను రద్దు చేశామన్నారు. మృతుల కుటుంబాలకు చిత్ర బృందం తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు.

గేర్ మార్చా

అఖండ సినిమా తర్వాత సినిమాల పరంగా గేర్ మార్చానని నా సెకెండ్ ఇన్నింగ్స్ లో నట విశ్వరూపం చూపిస్తానని "లెట్స్ వెయిట్ అండ్ వాచ్" అని తెలిపాడు. అలాగే నేను డాకు మహారాజ్ ని.. చరిత్ర సృష్టించాలన్న నేనే.. దాన్ని తిరగరాయాలన్నా నేనే అంటూ డైలాగ్ చెబుతూ అదరగొట్టాడు. ఇక ఊర్వశి రౌటేలా గురించి స్పందిస్తూ ఈ సినిమాలో ఉర్వశి డ్యాన్స్ మాత్రమే కాదు మంచి పాత్రా చేసిందని కచ్చితంగా ఆడియన్స్ కి నచ్చుతుందని తెలిపాడు.

Tags

Next Story