BHUVANESHWARI: నారా భువనేశ్వరికి మరో విశిష్ట పురస్కారం

BHUVANESHWARI: నారా భువనేశ్వరికి మరో విశిష్ట పురస్కారం
X
నారా భువనేశ్వరికి మరోసారి అంతర్జాతీయస్థాయి గుర్తింపు

హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి మరో అంతర్జాతీయ స్థాయి గుర్తింపును దక్కించుకున్నారు. డెయిరీ రంగంలో ఆమె చేస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా ఇండియన్ డెయిరీ అసోసియేషన్ (సౌత్ జోన్) ఆమెకు 'అవుట్‌స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్' అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అర్ధాంగిని అభినందిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. పాడి రైతుల అభ్యున్నతి, మహిళా సాధికారత కోసం భువనేశ్వరి చేస్తున్న కృషి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ గౌరవం ఆంధ్రప్రదేశ్‌లోని వేలాది మంది పాడి రైతుల కష్టానికి దక్కిన సరైన గుర్తింపు అని ఆయన పేర్కొన్నారు. పురస్కారంపై స్పందించిన భువనేశ్వరి.. ఇండియన్ డెయిరీ అసోసియేషన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ అవార్డును రాష్ట్రంలోని పాడి రైతులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. భారత డెయిరీ రంగాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు నిరంతరం కృషి చేస్తానని ఆమె ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

రాజధానితో జగన్‌ మూడు ముక్కలాట"

అమరావతి రాజధాని నిర్మాణం 2014 నుంచే ప్రారంభమయ్యిందని మంత్రి నారాయణ తెలిపారు. సీఎంగా జగన్ అధికారంలోకి తర్వాత వచ్చిన రాజధానితో మూడు ముక్కలాట ఆడారని ఆరోపించారు. వారి నిర్వాకం వల్లే రాజధాని నిర్మాణం ఆలస్యమైందని చెప్పారు. తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మారిందన్నారు. ఇప్పుడు వెళ్లి అమరావతి పనులు ఎలా జరుగుతున్నాయో చూడాలని సూచించారు. అక్కడి రైతులు కూడా ఆనందంగానే ఉన్నారని వివరించారు.

Tags

Next Story