భువనేశ్వరి పుట్టినరోజు.. తండ్రీ, తనయులు స్వీట్ విషెస్..

భువనేశ్వరి పుట్టినరోజు.. తండ్రీ, తనయులు స్వీట్ విషెస్..
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి పుట్టిన రోజు ఈ రోజు కావడంతో ఆమెకు X వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న నాకు కష్టకాలంలో కూడా అండగా నిలిచిన నా సర్వస్వానికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరికి ఎక్స్‌ వేదికగా విషెస్ తెలిపారు.

అంతే హూందాగా ఆమె కూడా భర్త చంద్రబాబు నాయుడు ట్వీట్ కి రియాక్టయ్యారు భువనేశ్వరి. " థ్యాంక్యూ అండీ, ప్రతి రోజు మరింత మెరుగ్గా నన్ను నేను మలుచుకోవడానికి మీరే నాకు స్ఫూర్తి. మన పెద్ద కుటుంబం ఆంధ్రప్రదేశ్ ప్రజలపై మీకు ఉన్న ప్రేమకు నేను గర్విస్తున్నాను. నేను మీకు ఎప్పుడూ మద్దతు ఇస్తూ తోడుగా ఉంటాను. మీరే నా సర్వస్వం అంటూ చంద్ర బాబు ట్వీట్ కు రిప్లై ఇచ్చారు.

ఇక ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్ కూడా తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు." నీ ప్రేమ, కరుణ, సపోర్టే నాకు అత్యంత బలాన్ని ఇస్తుంది. ప్రజా సేవలోనూ, వ్యాపార రంగంలోనూ అన్నింటా ముందుండి ధైర్యం చెప్పి నడిపించే నీవు మాకు స్ఫూర్తిదాయకం. ప్రతి రోజూ నేను నిన్ను మరింతగా ఆరాధిస్తాను. నీ ప్రేమాభిమానాలతో మా జీవితాలను మరింత ప్రకాశవంతం చేశావు. నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి"అని అమ్మకు ప్రేమగా పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేశారు లోకేశ్.



Tags

Next Story