రాష్ట్రంలో మెగా దోపిడీ జరుగుతోంది : చంద్రబాబు

రాష్ట్రంలో మెగా దోపిడీ జరుగుతోంది : చంద్రబాబు
రాష్ట్రంలో మెగా దోపిడీ జరుగుతోందంటూ మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. అన్నింటి పైనా పన్నులు పెంచారన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో మెగా దోపిడీ జరుగుతోందంటూ మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. అన్నింటి పైనా పన్నులు పెంచారన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా పరిటాలలో భోగి వేడుకల్లో పాల్గొన్న అనతంరం ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు.... వైసీపీ సర్కారును ఎండగట్టారు. పెంపుడు జంతువుల పైనా పన్నులు విధిస్తున్నారని మండిపడ్డారు. గాలి రెడ్డి కాబట్టి రేపోమాపో గాలిపైనా పన్ను వేస్తారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి రెండు కళ్లైన అమరావతి, పోలవరాన్ని పొడిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు.రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రంలో రైతులు ఎక్కడా ఆనందంగా లేరని, రైతు కూలీలు చితికిపోయారన్నారు. వరుస విపత్తులతో రైతులు నష్టపోతే ఎలాంటి పరిహారం ఇవ్వలేదన్నారు. పంటల బీమా ప్రీమియం చెల్లించకుండా చెల్లించానంటూ సీఎం జగన్‌ అడ్డంగా దొరికారని ఎద్దేవా చేశారు.

Tags

Next Story