Nara Lokesh : యువగళం వంద కిలోమీటర్లు పూర్తి

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర వంద కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా.. కర్నూలులో టీడీపీ నేతలు సంబరాలు జరిపారు. నంద్యాల జిల్లా అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి, పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి దంపతులు తమ స్వగృహం వద్ద పోస్టర్‌ను ఆవిష్కరించారు. వైసీపీ సర్కారు ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. అందుకే లోకేష్ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు గౌరు దంపతులు.
టీడీపీ యువనేత లోకేష్ పాదయాత్ర అశేష జనవాహిని మధ్య కొనసాగుతోంది. దారి పొడువునా పాదయాత్ర చేస్తోన్న లోకేష్.. ప్రజలకు అభివాదం చేస్తూ, స్థానిక సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. లోకేష్‌కు అడుగడుగునా జననీరాజనం పట్టారు. లోకేష్ వెంట టీడీపీ సీనియర్ నేత అమర్నాథ్‌రెడ్డి ఉన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.
గొల్లపల్లెలో వడ్డెర సామాజిక వర్గీయులతో లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా జగన్ సర్కారుపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. రైతులు, యువతను జగన్ మోసం చేశారన్నారు. అపద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారంటూ విమర్శించారు. జగన్‌రెడ్డికి పరిశ్రమలు తీసుకురావడం చేతకాదన్నారు. రాష్ట్రాన్ని ఉత్తర్‌ప్రదేశ్, బీహార్‌లా చేస్తున్నాడంటూ ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com