Nara Lokesh : అశేష జనవాహిని మధ్య యువగళం పాదయాత్ర

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర అశేష జనవాహిని మధ్య ఉత్సాహంగా కొనసాగుతోంది.శింగనమల నియోజకవర్గంలో లోకేష్‌కు ఘన స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు..మరోవైపు సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా పాదయాత్రలో పాల్గొనడంతో తమ అభిమాన నాయకులను ఒకే చోట చూడటంతో అభిమానుల్లో జోష్ నెలకొంది. జై బాలయ్య, జై లోకేష్ నినాదాలతో శింగనమల దద్దరిల్లింది. యువగళం పాదయాత్ర 800 కిలోమీటర్లు మార్క్ దాటిన నేపధ్యంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సింగనమల నియోజక వర్గ ప్రజలకు లోకేష్ హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి రాగానే చీనీ ప్రాసెసింగ్ యూనిట్
అంతకు ముందు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శింగనమల నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్రలో.. గంజా వద్దు బ్రో అంటూ నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ క్యాంపెయిన్ చేస్తున్నారు. లోకేష్ పాదయాత్రకి సంఘీభావం తెలిపి.. బాలయ్య పాదయాత్రలో పాల్గొన్నారు. గంజా వద్దు బ్రో అని రాసి ఉన్న క్యాప్ ధరించి... యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి అంటూ సందేశం ఇస్తున్నారు. గంజా వద్దు బ్రో అని రాసి ఉన్న టీ షర్టులు, క్యాపులను టిడిపి నాయకులు, కార్యకర్తలు, తెలుగు యువత, TNSF నాయకులు, వాలంటీర్లు ధరించారు.ఇక పాదయాత్రలో ఊహించని రీతిలో జన ప్రవాహం కనిపించింది.. దారిపొడవునా జనం బారులు తీరారు.. లోకేష్‌ను చూసేందుకు, ఆయనతో తమ సమస్యలు చెప్పుకునేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు.
మర్తాడు కెనాల్ దగ్గర స్థానికుల సమస్యలపై సమావేశం నిర్వహించారు. బూదేడు క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ కార్యక్రమంలో పాల్గొన్నారు. భోజన విరామం తరవాత సాయంత్రం గార్లదిన్నెలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు. పాదయాత్రను ముగించుకొని రాత్రికి జంబులదిన్నె వద్ద బస విడిది కేంద్రంలో బస చేయనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com