సింహాచలం అప్పన్న సన్నిధికి నువ్వేరా తేల్చుకుందాం.. సీఎం జగన్‌కు లోకేష్‌ సవాల్‌

సింహాచలం అప్పన్న సన్నిధికి నువ్వేరా తేల్చుకుందాం.. సీఎం జగన్‌కు లోకేష్‌ సవాల్‌
ఏ1 క్రిమినల్‌ సీఎం.. తన డెకాయిట్‌ బ్యాచ్‌ హెడ్‌ ఏ 2 దొంగరెడ్డితో... దొంగ ఆరోపణలు చేయిస్తున్నారని... ఇలా దొంగలతో దొంగ ఆరోపణలు ఎన్నాళ్లు చేయిస్తారని నిలదీశారు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ట్విట్టర్‌ వేదికగా సీఎం జగన్‌కు సవాల్‌ విసిరారు. విజయసాయిరెడ్డి తనపై చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలని ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని, జగన్‌ సిద్ధమేనా అని లోకేష్‌ ప్రశ్నించారు. సింహాచలం అప్పన్న సన్నిధికిరా తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు. ఏ1 క్రిమినల్‌ సీఎం.. తన డెకాయిట్‌ బ్యాచ్‌ హెడ్‌ ఏ 2 దొంగరెడ్డితో... దొంగ ఆరోపణలు చేయిస్తున్నారని... ఇలా దొంగలతో దొంగ ఆరోపణలు ఎన్నాళ్లు చేయిస్తారని నిలదీశారు. మీ బతుకు, పార్టీ, హామీలు, పాలన అన్నీ ఫేక్‌ అంటూ విరుచుకుపడ్డారు. తనపై దొంగలు చేసిన ఆరోపణలన్నీ ఫేక్‌ అని పింక్‌ డైమండ్‌తోనే తేలిందని లోకేష్ అన్నారు.


Tags

Read MoreRead Less
Next Story