ఎమ్మెల్యే కాటసాని, ఆయన కుమారుడు భూకబ్జాకి పాల్పడ్డారు : లోకేశ్ ఫైర్

వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ నేతలు, వారి కుమారులు భూకబ్జాలకి పాల్పడుతున్నారని విమర్శించారు. కర్నూల్ జిల్లా బనగానిపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఆయన కుమారుడు ఓబులరెడ్డి భూకబ్జాకి పాల్పడ్డారని ఆరోపించారు.. నంద్యాలలో ఉన్న భూమిని బలవంతంగా లాక్కోవడానికి లక్ష్మీదేవి అనే మహిళను బెదిరించి ఏడాదిగా హింసిస్తున్నారన్నారు.
మహిళల్ని వేధిస్తున్న వైకాపా ఎమ్మెల్యేల పై కఠిన చర్యలు తీసుకోవాలని.. తమపై మీ ప్రతాపమా జగన్ గారు అని ఒక చెల్లెమ్మ ప్రశ్నిస్తోంది, ఆ మహిళకు ఏమని సమాధానం చెబుతారు జగన్ రెడ్డి గారు? అంటూ తనదైన శైలిలో లోకేశ్ ప్రశ్నించారు. ఆలీబాబా 40 దొంగల తరహాలో జగన్, ఆయన ఎమ్మెల్యేలు ప్రజల పై పడి దోచుకుంటున్నారని ఆరోపించారు.. తమరి రౌడి పాలన కారణంగా కర్నూలు జిల్లాలో లక్ష్మీదేవి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com