జగన్‌ గారు చెబుతున్న నష్ట పరిహారం పత్రికల్లో తప్ప క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు : లోకేష్‌

జగన్‌ గారు చెబుతున్న నష్ట పరిహారం పత్రికల్లో తప్ప క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు : లోకేష్‌

విజయవాడ వరద బాధితుల సహాయ చర్యల్లో రాజకీయాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు బురద రాజకీయాలు మాని.. బాధితులను ఆదుకోవడంపై దృష్టి పెట్టాలంటూ ట్విట్టర్‌ వేదికగా హితవు పలికారు. లంక గ్రామాలు మునిగి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని.. ముఖ్యంగా కంద, పసుపు, పత్తి, మినుము, అరటి, మిర్చి రైతులు కన్నీరు పెడుతున్నారని లోకేష్‌ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. జగన్‌ రెడ్డి గారు చెబుతున్న నష్ట పరిహార అంచనాలు కేవలం పత్రికల్లో తప్ప క్షేత్రస్థాయిలో కనిపించడం లేదంటూ విమర్శించారు. అంచనా నివేదికలు త్వరగా పూర్తి చేసి రైతులకు పరిహారం అందించాలని లోకేష్ డిమాండ్‌ చేశారు. ‌


Tags

Read MoreRead Less
Next Story