జగన్‌ రెడ్డి దండుపాళ్యం గ్యాంగ్‌ పంక్చర్‌ షాపును కూడా వదలడం లేదు : లోకేష్‌

జగన్‌ రెడ్డి దండుపాళ్యం గ్యాంగ్‌ పంక్చర్‌ షాపును కూడా వదలడం లేదు : లోకేష్‌
జగన్‌ రెడ్డి దండుపాళ్యం గ్యాంగ్‌ పంక్చర్‌ షాపును కూడా వదలడం లేదని ట్విట్టర్‌లో మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌.

జగన్‌ రెడ్డి దండుపాళ్యం గ్యాంగ్‌ పంక్చర్‌ షాపును కూడా వదలడం లేదని ట్విట్టర్‌లో మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌. అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల కేంద్రంలో పంక్చర్‌ షాపు జీవనాధారంగా బతుకుతున్న కాలాచారి కుటుంబాన్ని వైసీపీ నాయకులు వేధించడం దారుణమన్నారు. కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయించి షాపును తొలగించాలని పోలీసులు ఒత్తిడి చేయడం వల్లనే కాలాచారి ఆత్మహత్యకు యత్నించాడని విమర్శించారు. వైసీపీ రౌడీలతో కొంతమంది కుమ్ముక్కై సామాన్యులను హింసించడం మంచి పరిణామం కాదని, ఇటువంటి చర్యలకు పాల్పడితే జగన్‌ రెడ్డి ప్రజాగ్రహానికి గురికాక తప్పదని.. లోకేష్‌ హెచ్చరించారు.


Tags

Next Story