ఇదేనా జగన్‌ రెడ్డి తెస్తానన్న రైతురాజ్యం : నారా లోకేశ్

ఇదేనా జగన్‌ రెడ్డి తెస్తానన్న రైతురాజ్యం : నారా లోకేశ్
రాజధాని గ్రామ రైతుల చేతులకు సంకెళ్లు వేయడాన్ని... టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తీవ్రంగా ఖండించారు. వరదలతో నిండా మునిగిన రైతుల్ని గాలికొదిలేశారు..

రాజధాని గ్రామ రైతుల చేతులకు సంకెళ్లు వేయడాన్ని... టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తీవ్రంగా ఖండించారు. వరదలతో నిండా మునిగిన రైతుల్ని గాలికొదిలేశారు. రాజధానికి భూమి ఇచ్చిన రైతులకు బేడీలు వేశారు.. ఇదేనా జగన్‌ రెడ్డి తెస్తానన్న రైతు రాజ్యం అంటూ ట్విట్టర్‌లో లోకేష్‌ ప్రశ్నించారు. 3 రాజధానుల ఆటో ఆర్టిస్టులను అడ్డుకున్నందుకే అంత కోపం వస్తే... తమ బతుకైన భూమిని ప్రజారాజధానికి త్యాగం చేసిన అన్నదాతలకు.. అమరావతిని చంపేస్తుంటే.. ఎంత కోపం రావాలి అంటూ నిలదీశారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేసి తక్షణమే విడుదల చేయాలని.. లేదంటే న్యాయం జరిగే వరకు రైతులతో కలిసి ఉద్యమిస్తామని లోకేష్‌ ట్విట్టర్‌ వేదికగా హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story