రైతుల గుండెలు ఆగిపోతున్నా జగన్‌రెడ్డి మనస్సు కరగడం లేదు : నారా లోకేశ్

రైతుల గుండెలు ఆగిపోతున్నా జగన్‌రెడ్డి మనస్సు కరగడం లేదు : నారా లోకేశ్

వైసీపీ నేతల అవమానాలతో.. అమరావతిలో 92 మంది రైతులు బలైపోయారంటూ.. ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌. రాష్ట్రం కోసం భూమి త్యాగం చేసిన రైతుల గుండెలు ఆగిపోతున్నా... జగన్‌రెడ్డి మనస్సు కరగడం లేదంటూ ట్వీట్‌ చేశారు. జై అమరావతి ఉద్యమం 300 రోజుకి చేరుకుంటున్న సమయంలో... ఒకే రోజు ఇద్దరు రైతులు చనిపోవడం బాధాకరమన్నారు. కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన లంకా శివరామకృష్ణ, ఉద్దండరాయునిపాలెంకు చెందిన పులి చిన్న లాజార్‌ మృతి పట్ల సంతాపం తెలిపారు లోకేష్‌. మూడు రాజధానుల మూర్ఖపు ఆలోచన మానుకుని... ఉన్న అమరావతిని అభివృద్ధి చేయాలన్నారు లోకేష్‌.

Tags

Next Story