420 జగన్‌ రెడ్డికి సవాల్ విసిరితే... 840 మొరుగుతోంది : నారా లోకేశ్‌

420 జగన్‌ రెడ్డికి సవాల్ విసిరితే... 840 మొరుగుతోంది : నారా లోకేశ్‌
X
A 1కి దమ్ము ధైర్యం లేదా... దైవం మీద ప్రమాణం అనగానే తోకముడిచి చర్చ అంటూ పారిపోతున్నారని ఎద్దేవా చేశారు.

తాను 420 జగన్ రెడ్డికి సవాల్ విసిరితే 840 మొరుగుతోంది ఏమిటని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్‌లో ప్రశ్నించారు. A 1కి దమ్ము ధైర్యం లేదా... దైవం మీద ప్రమాణం అనగానే తోకముడిచి చర్చ అంటూ పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. తనపై వైసీపీ చేసే ఆరోపణల్లో బురద రాజకీయం తప్ప నిజం లేదని ఇక్కడే తేలిపోయిందన్నారు. తనపై జగన్ రెడ్డి చేస్తున్న... చేయిస్తున్న ఆరోపణలు అవాస్తవం అని సింహాద్రి అప్పన్నపై ప్రమాణం చేయడానికి సిద్ధమన్నారు లోకేశ్‌. మరి జగన్ రెడ్డి సిద్ధమా అంటూ సవాల్ చేశారు నారా లోకేశ్‌.


Tags

Next Story