Nara Lokesh : ఏం పాలన ఇది.. రోజుకో రైతు రోడ్డెక్కుతున్నాడు: నారా లోకేష్

Nara Lokesh : సీఎం జగన్ పాలనలో న్యాయం చెయ్యడంటూ.. రోజుకో రైతు రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొందని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. రాజుపాలెంలో నష్టపరిహారం చెల్లించకుండా...రైతు వేమారెడ్డిని వేధిస్తున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు నుంచి భూమిని లాక్కొని...స్వయంగా మంత్రి అనుచరులే దౌర్జన్యంతో... కాలువకు గండికొట్టి పొలాల మీదుగా నీటిని తరలించటం దారుణమన్నారు నారా లోకేష్. మరోవైపు హంద్రీనీవా కాలువకు గండికొట్టి...నీటిని తన పొలం గుండా తీసుకెళ్తుండటాన్ని రైతు.. సెల్ఫీద్వారా తెలియజేస్తుండటం సంచలనమైంది.
అటు హిందూపురం మండలం రాచపల్లిలో మంత్రి శంకర్‌నారాయణ అనుచరుడినంటూ ...హంద్రీనీవా కాలువకు గండికొట్టి...నీటిని తన పొలం గుండా తీసుకెళ్తుండటాన్ని రైతు.. సెల్ఫీద్వారా తెలియజేస్తుండటం సంచలనమైంది. హంద్రీనీవా కాలువ నిర్మాణం కోసం...ఇదివరకే ఎకరం పొలం ఇచ్చినట్లు బాధిత రైతు తెలిపారు. ఇచ్చిన ఎకరం పొలానిక పైసా నష్టపరిహారం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com