LOKESH: వైసీపీ పని అయిపోయింది: లోకేశ్

ఆంధ్రప్రదేశ్ లో అరాచక జగన్ సర్కార్ పనైపోయిందని..వైసీపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. మంగళగిరికి చెందిన పలువురు నేతలు వైసీపీని వీడి లోకేశ్ సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. ఓడిన దగ్గరే గెలవాలనే పట్టుదలతో మళ్లీ మంగళగిరి నుంచి పోటీకి సిద్ధమైనట్లు ఆయనచెప్పారు. తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం ఏర్పడి ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుందన్నారు. పన్నుల ముఖ్యమంత్రి ఒక చేత్తో వంద రూపాయలు ఇచ్చి మరో చేత్తో ప్రజల నుంచి వెయ్యి రూపాయలు లాగేస్తున్నారని లోకేశ్ ఆరోపించారు.
మరోవైపు తెలుగుదేశం మొదటి జాబితా చూసి వైసీపీ నాయకులకు భయం పట్టుకుందని.... మాజీ ఎంపీ జె.సి.దివాకర్ రెడ్డి అన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం 12 స్థానాలు గెలుస్తుందని జోస్యం చెప్పారు. అభ్యర్థుల ప్రకటనలో చంద్రబాబు ఎన్నో జాగ్రత్తలు తీసుకుని... మంచి వారిని ఎంపిక చేశారని అభినందించారు. తెలుగుదేశం, జనసేన కూటమి విజయం సాధించి చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తంచేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com