Nara Lokesh: మిస్సింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎక్కడున్నారో తెలీదు- లోకేష్

X
Nara Lokesh: మిస్సింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎక్కడున్నారో తెలియడం లేదంటూ ఎద్దేవా చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్. ఇచ్చిన హామీలను ఎమ్మెల్యే ఒక్కటికి కూడా నేరవేర్చలేదన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని పర్యటించారు లోకేష్. తాడేపల్లి టౌన్ 9, 10 వార్డులు, డోలాస్ నగర్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కేపై మండిపడ్డారు. రెండో సారి ఎమ్మెల్యే గా గెలిచి వెయ్యి రోజులు అవుతున్నా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం లేదన్నారు. గెలిచిన వెంటనే పట్టాలు ఇస్తానని ఇచ్చిన హామీ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు లోకేష్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
