LOKESH: సొంత నిధులతో అన్నదాన సత్రం నిర్మిస్తా

బద్వేలు నియోజకవర్గం నల్లమలలోని కాశీనాయన ఆశ్రమంవద్ద అన్నదాన సత్రాన్ని అటవీ శాఖ అధికారులు కూల్చివేయడం బాధాకరమని మంత్రి లోకేశ్ తెలిపారు. భక్తుల మనోభావాలను గౌరవించి అన్నదాన కార్యక్రమాలు జరిగే భవనాలను కూల్చకుండా ఉండాల్సిందని పేర్కొన్నారు. ఈ కూల్చివేతలకు తాను క్షమాపణ చెబుతున్నానని తెలిపారు. తన సొంత నిధులతో అదే చోట అన్నదాన సత్రం పునర్నిర్మిస్తానని హామీ ఇచ్చారు. దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. సొంత నిధులతో అదే స్థలంలో అన్నదాన సత్రం పునర్నిర్మిస్తామని లోకేశ్ చెప్పారు .
జీవో 117ని రద్దు చేశాం: లోకేశ్
నాడు నేడు అంటూ గత ప్రభుత్వం ఫేజ్ 1, 2, 3 అని మొదలు పెట్టి, ఫేజ్ 1 కూడా పూర్తిగా చేయలేదని మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ఫేజ్ 2లో అనేక పనులు పెండింగ్ ఉన్నాయని, ఫేజ్-1, ఫేజ్-2 పెండింగ్ పనులు పూర్తి చేయటానికే రూ.4,789 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. పిల్లలను విద్యకు దూరం చేసే జీవో 117ని కూటమి ప్రభుత్వం రాగానే రద్దు చేసిందని తెలిపారు.
లైబ్రరీల ప్రాధాన్యం తెలిసింది: లోకేష్
మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్మార్ట్‌ఫోన్లు వచ్చాక లైబ్రరీలు అవసరమా అనిపించేదని తెలిపారు. కానీ పాదయాత్ర సమయంలో లైబ్రరీల ప్రాధాన్యం తెలిసిందని లోకేష్ చెప్పుకొచ్చారు. సమాచారం, విజ్ఞానంపై చర్చించడానికి లైబ్రరీలు వేదికలుగా ఉంటాయన్నారు. ఏయే ప్రాంతాల్లో ఏ పుస్తకాలు ఉండాలో చర్చిస్తున్నామని, అలాగే పాఠశాలల్లో పెండింగ్ పనులను పూర్తి చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
సీఎంకు మంత్రి లోకేశ్ పరోక్ష కౌంటర్
త్రిభాషా విధానం అంశంపై తమిళనాడు సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ పరోక్ష కౌంటర్ ఇచ్చారు. మాతృభాష విషయంలో పొరుగు రాష్ట్రాలు అనవసర రాజకీయం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. మాతృభాషను కాపాడుకోవాలి కానీ కొందరు కావాలని రాజకీయం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం జర్మన్, జపనీస్ భాషలు మన విద్యార్థులకు నేర్పుతుంటే త్రిభాషా విధానం ఎలా తప్పవుతుందని లోకేశ్ ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com