Nara Lokesh : అమిత్ షాకి లేఖ రాసిన నారా లోకేష్..!

Nara Lokesh : అమిత్ షాకి లేఖ రాసిన నారా లోకేష్..!
X
Nara Lokesh : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు.

Nara Lokesh : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని ఈ లేఖలో పేర్కొన్నారు ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని ఈ లేఖలో పేర్కొన్నారు. పలు రాష్ట్రాల్లో సీబీఎస్ఈ బోర్డులు పరీక్షలు రద్దు చేశాయని గుర్తు చేశారు లోకేష్.. ఇంటర్ విద్యార్థులు తమ పరీక్షల పట్ల అయోమయంలో ఉన్నారన్న ఆయన... కరోనా ఉధృతిలో విద్యార్థుల ప్రాణాలు పణంగా పెట్టడం తగదన్నారు. పరీక్షలు వద్దని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభ్యసిస్తున్న ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని అన్నారు. పరీక్షల విషయంలో సీబీఎస్ఈ అనుసరిస్తున్న విధానాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని లేఖలో అమిత్ షా ను కోరారు లోకేష్.



Tags

Next Story