AP:ఏపీలో ఏఐ సెంటర్ ను ఏర్పాటు చేయండి

AP:ఏపీలో ఏఐ సెంటర్ ను ఏర్పాటు చేయండి
X
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ కు నారా లోకేశ్ విజ్ఞుప్తి... అవకాశాలు అందుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటన

ఢిల్లీలో పర్యటిస్తున్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌.. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశమయ్యారు. ఏపీలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అశ్వినీ వైష్ణవ్‌ను మంత్రి లోకేశ్ కోరారు. కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేశ్ కోరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రాబోతున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందన్నారు. రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధికంగా కేటాయింపులు చేసినందుకు అశ్వినీ వైష్ణవ్‌కు లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు

ఏపీకి చేయూతనివ్వాలి

ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో ఏపీకి చేయూతనివ్వాలని కోరినట్టు అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజ్టెకులు, వివిధ అంశాలపై సుమారు 2 గంటల పాటు కేంద్రమంత్రితో లోకేశ్ చర్చించారు. ఈ భేటీలో మంత్రి లోకేశ్ వెంట కేంద్ర మంత్రులు రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌ ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న కేంద్రమంత్రులు, ఎంపీలను మంత్రి లోకేశ్ అభినందించారు. సమష్టి కృషితోనే ఏపీకి మేలని, ​కలిసికట్టుగా ఉండటం వల్లే విశాఖ స్టీల్ ​ను కాపాడుకోగలిగాం అని కేంద్ర మంత్రులు, పార్టీ ఎంపీలతో మంత్రి నారా లోకేశ్ చెప్పుకొచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రాబోతున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని...ఇందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అందించాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నంలో తాము ఏర్పాటు చేయాలనుకుంటున్న డేటా సిటీకి సహకరించాలని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను రాష్ట్రమంత్రి నారా లోకేశ్ కోరారు.

ఇదే పంథా కొనసాగిద్దాం: లోకేశ్‌

రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర మంత్రులు, ఎంపీలు చేస్తున్న కృషిని ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌ అభినందించారు. ఢిల్లీ చేరుకున్న మంత్రి లోకేశ్‌ను.. కేంద్రమంత్రులు, టీడీపీ ఎంపీలు, BJP నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. కలిసికట్టుగా ఉండటం వల్లే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోగలిగామన్న లోకేశ్‌.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఇక ముందు కూడా ఇదే పంథా కొనసాగిద్దామని ఎంపీలకు సూచించారు.

Tags

Next Story