దాడికి గురైన టీడీపీ నేత.. ఫోన్‌లో పరామర్శించిన నారా లోకేష్
గుంటూరు జిల్లా తెలుగు దేశం పార్టీ నాయకుడు కోటి సుబ్బారావును టీడీపీ నేతలు పరామర్శించారు. వైసీపీ వర్గీయులు కోటి సుబ్బారావు ఇంటిపై దాడిచేసిన నేపథ్యంలో ఆయనను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎంపీపీ కోటి సుబ్బారావుకు పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా నారా లోకేష్ ఫోన్ లో హామి ఇచ్చారు. చింతలపాలెం వెళ్లిన జీవి ఆంజనేయులు,చదవలవాడ అరవింద్ బాబు, రాష్ట్ర తెలుగు రైతు సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డీలు... కోటి సుబ్బారెడ్డిని కలిసి ధైర్యం చెప్పారు. వైసీపీ దాడులకు బయపడేదిలేదని వారు తేల్చిచెప్పారు.
అయితే తమ ఇంటిపై దాడి చేసినవారిపై ఫిర్యాదు చేసేందుకు వెళితే ... తిరిగి తనపై కేసు నమోదుచేశారని బాధితుడు కోటి సుబ్బారావు ఆవేదన వ్యక్తంచేశారు. తమ ఇంటిపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com