సీఎం జగన్ తీరుపై నారా లోకేష్ ఫైర్!

సీఎం జగన్ తీరుపై నారా లోకేష్ ఫైర్!
సొంత నియోజకవర్గంలో మహిళలకు రక్షణ కల్పించలేని సీఎం జగన్.. టీడీపీ నాయకులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వికృతానందం పొందుతున్నారని ఆరోపించారు.

సీఎం జగన్ తీరుపై మరోసారి మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. సొంత నియోజకవర్గంలో మహిళలకు రక్షణ కల్పించలేని సీఎం జగన్.. టీడీపీ నాయకులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వికృతానందం పొందుతున్నారని ఆరోపించారు. దళిత మహిళ నాగమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఛలో పులివెందుల కార్యక్రమానికి పిలుపు ఇస్తే 20 మందిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడం దారుణమన్నారు. మహిళలను కాపాడాలని ఎమ్మెల్సీ బీటెకె రవి నిలదిస్తే.. అతడినే అరెస్ట్ చేయడం దారుణమని లోకేష్ మండిపడ్డారు.


Tags

Next Story