Nara Lokesh : పెగాసస్ సాప్ట్‌వేర్ కొనుగోలు చేయలేదన్న నారా లోకేష్‌

Nara Lokesh  : పెగాసస్ సాప్ట్‌వేర్ కొనుగోలు చేయలేదన్న నారా లోకేష్‌
Nara Lokesh : పెగాసస్ కొన్నది నాటి చంద్రబాబు ప్రభుత్వమే అని బెంగాల్ అసెంబ్లీలో సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు కొట్టిపారేశారు.

TDP : పెగాసస్ కొన్నది నాటి చంద్రబాబు ప్రభుత్వమే అని బెంగాల్ అసెంబ్లీలో సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు కొట్టిపారేశారు. పెగాసస్ ఇజ్రాయెల్ నుంచి కొన్నారు అంటూ మమత చేసిన వ్యాఖ్యలపై నారా లోకేష్ , మాజీ మంత్రులు అయ్యన్న పాత్రుడు, జవహర్, ఎమ్మెల్సీ బిటెక్ రవి ఘాటుగా స్పందించారు. ఒకవేళ పెగాసస్‌ను తాము కొనుగోలు చేసి ఉంటే ఇప్పటికే దొరికిపోయే వాళ్లం కదా అని బదులిచ్చారు.

పెగాసస్ సాప్ట్‌వేర్ ను టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేయలేదని అప్పటి ఐటి శాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. చట్ట వ్యతిరేక పనులను చంద్రబాబు ఎప్పుడూ అనుమతించన్నారు. పెగాసెస్ సాఫ్ట్‌వేర్‌ తాము కొనుగోలు చేసి ఉంటే.. జగన్ అధికారంలోకే వచ్చేవారా?అని లోకేష్ మీడియాతో అన్నారు. ఒకవేళ మా హయాంలో పెగాసెస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసి ఉంటే.. ఈ మూడేళ్లలో జగన్ ప్రభుత్వం తమపై చర్యలు తీసుకోకుండా ఉండేవారా అని అన్నారు.

టీడీపీ తప్పులు వెతకడానికి.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐటీ సహా అన్ని శాఖలకు సంబంధించిన ఫైళ్లను జగన్ తనిఖీలు చేయించారన్నారు. టీడీపీ ప్రభుత్వం పెగాసెస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేశారని మమతా బెనర్జీ నిజంగానే కామెంట్ చేసి ఉంటే.. ఆమెకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్లి ఉండొచ్చు అని లోకేష్ అన్నారు. నాటి చంద్రబాబు ప్రభుత్వం పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనలేదని స్వయంగా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగే చెప్పారు. సమాచార హక్కు చట్టం ప్రకారం జులై 25, 2021 న కర్నూలు జిల్లాకు చెందిన నాగేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా.... అసలు అటువంటి సాఫ్ట్ వేర్ ఏదీ కొనలేదని స్వయంగా నాటి డిజిపి సవాంగ్ ఆగస్ట్ 12-2021న సమాధానం ఇచ్చినట్లు ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు గుర్తు చేశారు.

తప్పుడు పనులు చేసి చిప్ప కూడు తినడానికి ఆయన జగన్ రెడ్డి కాదు... చంద్రబాబు అంటూ మరో మాజీ మంత్రి జవహర్ అన్నారు. స్వలాభం కంటే వ్యవస్థలే ముఖ్యం అని బలంగా నమ్మే గొప్ప వ్యక్తి చంద్రబాబు అని... అందుకే మూడేళ్ల నుండి మూడు చెరువుల నీళ్లు తాగారే తప్ప ఆయనను ఏమి చేయలేక పోయారంటూ ట్విట్టర్ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు జవహర్. నాటి ప్రభుత్వం పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనలేదని సవాంగ్ ఇచ్చిన సమాధానం చూశాక జగన్ రెడ్డి గారి ముఖ చిత్రం ఏంటో మారిపోయిందని ఆయన సెటైర్లు వేశారు. మా దగ్గర పెగాసస్ ఉంటే అబ్బాయిల గొడ్డలిపోటు నుండి బాబాయ్ వివేకాని కాపాడేవాళ్లం కదా! అంటూ టీడీపీ ఎమ్మెల్సీ బిటెక్ రవి స్పష్టంచేశారు.

Tags

Read MoreRead Less
Next Story