జగన్ రెడ్డి మొహం చూసి ఒక్క కంపెనీ రాలేదు : నారా లోకేశ్
కంపెనీలు అన్నీ జగన్ రెడ్డికి బైబై చెప్పేస్తున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.

కంపెనీలు అన్నీ జగన్ రెడ్డికి బైబై చెప్పేస్తున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. వైసీపీ నేతల విధ్వంసం, బెదిరింపులతో కంపెనీలు భయపడుతున్నాయని చెప్పారు. జగన్ రెడ్డి మొహం చూసి ఒక్క కంపెనీ రాలేదని, పైగా ఏపీలోని కంపెనీలు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయని విమర్శించారు. జగన్ రెడ్డి నిర్లక్ష్య ధోరణి నిరుద్యోగులకు శాపంగా మారిందని ధ్వజమెత్తారు. విశాఖ నుంచి హెచ్‌ఎస్‌బీసీ తరలిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని లోకేశ్ నిప్పులు చెరిగారు.
Next Story