రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకోనున్న లోకేశ్

రైతుల కష్టాలను కళ్లారా చూసేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. శుక్రవారం ఆయన అనంతపురం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. గుంతకల్లు, తాడిపత్రి, సింగనమలతో పాటు రాప్తాడు నియోజకవర్గ పరిధిలో.. ఈ పర్యటన సాగుతోంది. ఉదయం కరిడికొండలో లోకేష్ పర్యటన ప్రారంభమవుతుంది. అనంతరం అక్కడినుంచి ధర్మపురం వెళ్తారు. మిడ్తూర్, రామదాస్‌పేట, కుమారుపల్లిలో పర్యటించనున్నారు లోకేష్. రైతులకు జరిగిన పంట నష్టంపై ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఎలాంటి అంచనా వేయలేదు.
ఉదయం 9 గంటలకు గుంతకల్లు నియోజకవర్గం నుంచి పర్యటన ప్రారంభిస్తారు. నష్టపోయిన పంటలను పరిశీలించి.. రైతులతో నేరుగా మాట్లాడుతారు. వేరు శనగ,స పత్తి మిరప సహా అన్నీ పంటలు నష్టపోయామంటున్నరాు రైతులు. రాయలసీమలో నాలుగేళ్లుగా 1800 కోట్లు బకాయిలు రావాలన్నారు మాజీ మంత్రి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాస్.
రైతు భరోసా కేంద్రాలన్నీ, రైతు దఘా కేంద్రాలుగా మరాయంటూ ఆరోపించారు కాలవ శ్రీనివాస్‌లు. అడుగడుగునా రైతులను ప్రభుత్వం మోసం చేస్తోంది. ఇన్‌పుట్ సబ్సీడి, ఇన్సూరెన్స్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం మాటలతో సరిపెడుతోందన్నారు. ప్రభుత్వ అసమర్ధ విధానాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసే సంకల్పంతో నారా లోకేష్ పర్యటన సాగునుంది. ఈ పర్యటనలో రైతులు, ప్రజాసంఘాల నేతలు, టీడీపీ నేతలు హాజరవుతున్నారు. ఇకపైనైనా... రైతుల్ని ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com