రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం : నారా లోకేశ్

తుఫాను బీభత్సంతో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. తక్షణమే పంట నష్టం అంచనాలు వేసి.. రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పచ్చలతాడిపర్రులో దెబ్బతిన్న పంటను లోకేశ్ పరిశీలించారు. రైతులు తమ గోడును లోకేశ్‌కు వివరించారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్ష బీభత్సానికి నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం... బాపట్ల మండలం ఈతేరులోనూ లోకేశ్ పర్యటించారు. దెబ్బ తిన్న పంటను పరిశీలించారు. నష్టం అంచనా వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నప్పటికీ జగన్ సర్కారు కనీసం పరామర్శించడం లేదని లోకేశ్ విమర్శించారు. అన్నదాతలకు న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామని స్పష్టంచేశారు.
Next Story