రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎం జగన్‌ ప్యాలస్‌లో నిద్రపోతున్నారు : లోకేష్

రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎం జగన్‌ ప్యాలస్‌లో నిద్రపోతున్నారు : లోకేష్
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ప్యాలస్‌లో నిద్రపోతున్నారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా మండిపడ్డారు.

రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ప్యాలస్‌లో నిద్రపోతున్నారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా మండిపడ్డారు. రైతు కోసం కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లాలో లోకేష్ పర్యటిస్తున్నారు. 19 నెలల వైసీపీ పాలనలో 766 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్న లోకేశ్.. జగన్ రెడ్డి ఒక ఫేక్ సీఎం అని, ఇది దున్నపోతు ప్రభుత్వమంటూ తీవ్రంగా విమర్శించారు. రైతులు కష్టాల్లో ఉంటే వ్యవసాయ శాఖ మంత్రి రికార్డు డ్యాన్సులు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు టీడీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు.

అవనిగడ్డ నియోజకవర్గంలో పంట నష్టంతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను లోకేష్ పరామర్శించారు. నివర్ తుఫాను కారణంగా పంట నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న నలుగురు కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించారు. అవనిగడ్డ వెళ్తున్న సమయంలోనే మార్గమధ్యంలో పెడన నియోజకవర్గం గూడూరు మండలం రైతులను కలిశారు. నివర్ తుఫానుతో తీవ్రంగా నష్టపోయామని రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story