19 Oct 2020 5:03 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / నేడు తూర్పుగోదావరి...

నేడు తూర్పుగోదావరి జిల్లాలో నారా లోకేష్ పర్యటన

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇవాళ.. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో.. జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి..

నేడు తూర్పుగోదావరి జిల్లాలో నారా లోకేష్ పర్యటన
X

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇవాళ.. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో.. జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం, అనపర్తి నియోజకవర్గాల్లోని ఆయా ప్రాంతాలు జలమయం అయ్యాయి. గ్రామాలతో పాటు.. వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు లోకేష్‌ పర్యటించనున్నారు. దెబ్బతిన్న పంటలు, నీట మునిగిన ఇళ్ళు పరిశీలించి క్షేత్రస్థాయిలో నష్టపోయిన రైతులు, ప్రజల్ని కలవనున్నారు నారా లోకేష్.

  • By kasi
  • 19 Oct 2020 5:03 AM GMT
Next Story