కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌కు నారా లోకేష్ లేఖ

కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. ఏలూరులో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని లేఖ ద్వారా కోరారు. కొద్ది రోజులుగా ఏలూరులో ఆరోగ్య సంక్షోభం నెలకొందని.. వందలాది మంది అపస్మారక స్థితిలోకి వెళ్లారని లోకేష్ తెలిపారు. ప్రజల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందన అంతంతమాత్రంగానే ఉందన్నారు. అత్యవసర పరిస్థితిగా పరిగణించి చర్చలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇక రికవరీ రేట్లను అధికంగా నమోదు చేయడం కోసం బాధితులను త్వరగా డిశ్చార్జ్ చేస్తున్నారన్నారు. ప్రజారోగ్యంపై దృష్టి పెట్టకుండా.. మాస్ హిస్టీరియా అంటూ ప్రచారం చేయడంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏలూరు ప్రజలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వ జ్యోక్యం అవసరమన్నారు నారా లోకేష్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com