70వ రోజు లోకేష్ పాదయాత్ర..పసుపుమయమైన డోన్ నియోజకవర్గం

X
By - Subba Reddy |14 April 2023 9:00 AM IST
కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర 70వ రోజు అశేష జనవాహిని మధ్య కొనసాగుతుంది
కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర 70వ రోజు అశేష జనవాహిని మధ్య కొనసాగుతుంది. ఊరువాడ ఆయనకు ఘన స్వాగతం పలుకుతుంది. మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు. చిన్నాపెద్ద కలిసి లోకేష్ వెంట నడుస్తున్నారు. పసుపుమయమైన డోన్ నియోజకవర్గంలో రెండో రోజు పాదయాత్రలోగుడిపాడులో స్థానికులతో లోకేష్ మాటమంతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. తరువాత హెచ్ ఆర్ పల్లిలో యాదవులతో సమావేశం అయి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. అలాగే పూదొడ్డి క్రాస్ దగ్గర మామిడి రైతులతో భేటీ కానున్నారు.ఇక ప్యాపిలి బీసీ కాలనీ దగ్గర యువగళం పాదయాత్ర 900 కిలోమీటర్ల మార్క్‌ను దాటనుంది. ఈ సందర్భంగా అక్కడ శిలాఫలకం ఆవిష్కరించనున్నారు.అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు లోకేష్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com