మంగళగిరిలో ఖాళీ అవుతున్న వైసీపీ

జనగళమే యువగళమై మహా ప్రభంజనంలా సాగుతున్న నారా లోకేష్ పాదయాత్ర స్వంత నియోజక వర్గం మంగళగిరికి చేరుకుంది. పాదయాత్ర అశేష జనవాహిని మధ్య కొనసాగుతోంది. మరోవైపు మంగళగిరిలో వైసీపీ ఖాళీ అవుతోంది.యువనేత సమక్షంలో అధికార పార్టీ నుంచి భారీగా యువత టీడీపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు లోకేష్.జై టీడీపీ, జై లోకేష్ నినాదాలతో దద్దరిల్లింది మంగళగిరి. రాష్ట్రంలో ఇప్పటి వరకు మరే నాయకుడు చేయని రీతిలో లోకేష్ పాదయాత్ర చేశారని.. రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు టీడీపీతోనే సాధ్యమని.. యువనేత లోకేష్ కమీట్‌మెంట్ నచ్చే పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన యువకులు. రాష్ట్రం గెలవాలంటే మళ్లీ బాబే రావాలని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా గెలిచితీరుతుందని ధీమా వ్యక్తం చేశారు యువకులు.
మరోవైపు లోకేష్‌ను చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు ప్రజలు. లోకేష్ రాక కోసం దారిపొడవునా బారులు తీరిన జనం. జన ప్రవాహన్ని తలపిస్తుంది యువగళం పాదయాత్ర.లోకేష్ వెంట పార్టీ నేతలు, కార్యకర్తల తోపాటు ప్రజలు, అభిమానులు అడుగులో అడుగు వేస్తున్నారు. దారి పొడువునా ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్నా నారా లోకేష్.. వారి సమస్యల్ని స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com