ఉమ్మడి కడప జిల్లాలో యువగళం ప్రభంజనం

ఉమ్మడి కడప జిల్లాలో యువగళం ప్రభంజనం
ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్రకు జనం నీరాజనం పలుకుతున్నారు

ఉమ్మడి కడప జిల్లాలో యువగళం ప్రభంజనం కొనసాగుతోంది. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్రకు జనం నీరాజనం పలుకుతున్నారు. ఇప్పటి వరకు మొత్తం 14 వందల 46.1 కిలోమీటర్లు విజయవంతంగా పూర్తి చేసిన లోకేష్.. 15 వందల కిలోమీటర్ల మైలురాయి వైపు అడుగులు వేస్తున్నారు.

యువగళం 113వ రోజు ఇవాళ సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుంది. చౌటపల్లి బాక్స్ క్రికెట్ ప్రాంగణం వద్ద క్యాంప్ సైట్ నుంచి లోకేష్ పాదయాత్రను ప్రారంభించనున్నారు. అనంతరం 4 గంటల 10 నిమిషాలకు దొరసానిపల్లిలో బుడగజంగాలతో సమావేశం కానున్నారు. 4 గంటల 35 నిమిషాలకు ప్రొద్దుటూరు ఆంజనేయస్వామి విగ్రహం వద్ద యువత, 4 గంటల 40 నిమిషాలకు గాడిదకొట్టాల వద్ద స్థానికులతో భేటీ అవుతారు. ఆ తర్వాత 4 గంటల 45 నిమిషాలకు జీవనజ్యోతి స్కూలు వద్ద చేనేతలతో లోకేష్ సమావేశం అవుతారు. 4 గంటల 50 నిమిషాలకు ఆర్ట్స్ కాలేజి జంక్షన్, 5 గంటలకు సాయిబాబా గుడివద్ద స్థానికులతో భేటీ కానున్నారు. 5 గంటల 5 నిమిషాలకు వన్ టౌన్ సర్కిల్‌లో పర్లపాడు గ్రామస్తులతో సమావేశం అనంతరం 5 గంటల 10 నిమిషాలకు ఎల్ఐసీ కార్యాలయం వద్ద క్రిస్టియన్లతో భేటీ కానున్నారు. 5 గంటల 15 నిమిషాలకు ఎన్టీఆర్ సర్కిల్‌లో స్థానికులతోను,

5 గంటల 20 నిమిషాలకు అమ్మవారిశాల వద్ద ఆర్యవైశ్య సామాజికర్గీయులతో సమావేశం కానున్నారు. 5 గంటల 25 నిమిషాలకు బంగారు అంగళ్లు వీధిలో స్వర్ణకారులతోను, 5 గంటల 30 నిమిషాలకు దర్గా వద్ద ముస్లింలతో సమావేశం కానున్నారు లోకేష్. ఇక సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు శివాలయం సర్కిల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో యువనేత లోకేష్ ప్రసంగిస్తారు. సభ అనంతరం రాత్రి 7 గంటల 5 నిమిషాలకు ఆర్టీసీ బస్టాండు వద్ద.. 7 గంటల 55 నిమిషాలకు కొత్తపల్లి రిలయన్స్ జంక్షన్‌లో స్థానికులతో సమావేశం కానున్నారు. 8 గంటల 25 నిమిషాలకు కొత్తపల్లి ఖాదరబాద్‌లో స్థానికులతో మాటామంతీ నిర్వహించే నారా లోకేష్.. రాత్రి 8 గంటల 35 నిమిషాలకు కొత్తపల్లి శివారు పీఎన్ఆర్ ఎస్టేట్ వద్ద ఏర్పాటు చేసిన విడిది కేంద్రంలో బస చేస్తారు.

Tags

Read MoreRead Less
Next Story