184వ రోజు కొనసాగుతున్న నారా లోకేష్ పాదయాత్ర

184వ రోజు కొనసాగుతున్న నారా లోకేష్ పాదయాత్ర


టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర జన నీరాజనం మధ్య కొనసాగుతోంది. ఎక్కడికక్కడ లోకేష్‌కు ఘన స్వాగతం లభిస్తోంది. లోకేష్‌ వెంట పార్టీ నేతలు, కార్యకర్తల తోపాటు ప్రజలు, అభిమానులు విరివిగా పాల్గొంటున్నారు. లోకేష్ వెంట అడుగులో అడుగు వేస్తూ మేము సైతం ముందుకు సాగుతున్నారు. దారి పొడువునా ప్రజలకు అభివాదం చేసుకుంటూ, ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు నారా లోకేష్. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యలను అంశాల వారీగా పరిష్కరిస్తామని భరోసా కల్పిస్తున్నారు.

184వ రోజు పాదయాత్ర గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో కొనసాగుతోంది. రావెల శివారు క్యాంప్ సైట్‌ నుంచి ఇవాళ్టి పాదయాత్ర ప్రారంభమైంది. కాసేపట్లో పొన్నెకల్లులో ముస్లిం సామాజిక వర్గాయులతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత తాడికొండ అడ్డరోడ్డులో స్థానికులతో భేటీ అవుతారు. తాడికొండ శివార్లలో ఆడిటర్లతో ముఖాముఖి నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత తాడికొండ శివార్లలో భోజన విరామం తీసుకుంటారు.

సాయంత్రం 4గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభంకానుంది. తాడికొండ శివార్ల నుంచి పాదయాత్రను కొనసాగిస్తారు. ఆ తర్వాత తాడికొండ ఎన్టీఆర్ సర్కిల్‌లో స్థానికులతో మాటామంతి నిర్వహిస్తారు. రాత్రి 8గంటలకు కంతేరులో స్థానికులతో సమావేశం అవుతారు. రాత్రి 9గంటల 30నిమిషాలుక నిడమర్రు శివారు విడిది కేంద్రంలో బస చేస్తారు. లోకేష్‌ను చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఆయన కోసం దారిపొడవునా నిల్చుని ఎదురు చూస్తున్నారు జనం. లోకేష్‌తో కలిసి ఫోటో దిగేందుకు, ఆయనతో కరచలనం చేసేందుకు పోటీపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story