Yuvagalam: నేడు ఆదోని నుంచి మంత్రాలయంలోకి లోకేష్‌ ఎంట్రీ

Yuvagalam: నేడు ఆదోని నుంచి మంత్రాలయంలోకి లోకేష్‌ ఎంట్రీ
నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో 80వ రోజుకు చేరుకుంది

నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో 80వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు వెయ్యి 20 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి అయ్యింది. ఇవాళ ఆదోని నియోజకవర్గం నుంచి మత్రాలయం నియోజకవర్గంలోకి లోకేష్‌ పాదయాత్ర ఎంట్రీ కానుంది. ఉదయం 8గంటలకు తుంబళం క్రాస్ విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. 8.20 నిమిషాలకు మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గంలోకి యువగళం పాదయాత్ర ఎంట్రీ ఇస్తోంది. అనంతరం పాదయాత్రగా ముందుకు వెళ్తూ గవిగట్టు క్రాస్, బాపులదొడ్డి క్రాస్, పేకలబెట్ట క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం కానున్నారు. ఇక మధ్యాహ్నానానికి లోకేష్‌ పాదయాత్ర కోసిగికి చేరుకుంటుంది. కోసిగిలో స్థానికులతో మాటామంతీ కార్యక్రమం అనంతరం 12.30 నిమిషాలకు కోసిగి యల్లమ్మ దేవాలయం సమీపంలో భోజన విరామం తీసుకుంటారు.

సాయంత్రం 5గంటలకు కోసిగి యల్లమ్మ దేవాలయం వద్ద బహిరంగసభలో లోకేష్ ప్రసంగిస్తారు. అనంతరం పాదయాత్రగా వెళ్లి 6.15 నిమిషాలకు కోసిగి బస్టాండు వద్ద స్థానికులతో సమావేశం నిర్వహిస్తారు. ఇక 6.25 నిమిషాలకు కోసిగి తేరుబజార్ వద్ద షాప్ కీపర్లతో భేటీ అవుతారు. 7గంటలకు కోసిగి చింతకుంట క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీలో పాల్గొంటారు. అనంతరం పాదయాత్రగా కోసిగి శివారుల్లోని విడిది కేంద్రానికి చేరుకుంటారు. దీంతో 80వ రోజు లోకేష్‌ పాదయాత్ర ముగుస్తోంది. రాత్రికి లోకేష్ అక్కడే బస చేస్తారు.

Tags

Read MoreRead Less
Next Story