స్కూళ్లు తెరుస్తున్నప్పుడు, స్థానిక సంస్థల ఎన్నికలకు ఇబ్బందేంటి? : ఎంపీ రఘురామకృష్ణరాజు

ఏపీలో స్కూళ్లు తెరుస్తున్నప్పుడు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వచ్చిన ఇబ్బంది ఏమిటని ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.. ప్రభుత్వం పంతానికి పోవద్దని హితవు పలికారు.. నిమ్మగడ్డ రమేష్ రిటైరయిన తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడం సరైనది కాదన్నారు. ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ ఉంటే ఏకగ్రీవాలు జరగవని భయపడుతున్నారని ప్రచారం జరుగుతోందని, అలాంటి పరిస్థితి మన ప్రభుత్వానికి రావద్దని అన్నారు..సంక్రాంతి తర్వాత ఎన్నికల సంఘానికి సహకరించి స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని రఘురామ ప్రభుత్వాన్ని కోరారు.
న్యాయస్థానాలతో ఘర్షణకు దిగడం సరైన చర్య కాదన్నారు రఘురామకృష్ణరాజు. న్యాయమూర్తులు న్యాయం పక్షానే నిలబడతారని అన్నారు.. ఇష్టానుసారం పిటిషన్లు వేస్తూ కోర్టులతో మొట్టికాయలు వేయడం మానుకోవాలని రఘురామ హితవు పలికారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com