NaravariPalli: బాబు రాకతో పల్లెకు ముందే పండగొచ్చే...

NaravariPalli:  బాబు రాకతో పల్లెకు ముందే పండగొచ్చే...
3ఏళ్ల తరువాత నారావారిపల్లెలో అడుగుపెట్టిన మాజీ సీఎం, చంద్రబాబు రాకతో పల్లెలో అప్పుడే పండగ వాతావరణం...

నారావారి పల్లెలో అప్పుడే సంక్రాంతి సంబరాలు షురూ అయ్యాయి. ఆ ప్రాంతమంతా సంక్రాంతి శోభ సంతరించుకుంది.మూడేళ్ల తరువాత మాజీ సీఎం చంద్రబాబు సొంతూరుకి రావడంతో ఊరంతా పండగ సందడి మొదలైంది.


చంద్రబాబు, లోకేశ్‌ను కలిసేందుకు పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నారావారి పల్లెకు చేరుకున్నారు.. మరికాసేపట్లో నందమూరి కుటుంబ సభ్యులు కూడా చేరుకోనున్నారు.


చంద్రబాబుతో సెల్ఫీలు దిగేందుకు యువకులు ఎగబడుతున్నారు. మాజీ సీఎం కూడా అందరితో కలసి ఉత్సహాంగా ఫోటోలు దిగారు. నారా, నందమూరి ఫ్యామిలీ నారావారి పల్లె రావడం తమకు ఎంతో సంతోషంగా ఉందని, ఈసారి పండగ సంబరాలు అంబరాన్ని అంటినట్లేనని గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.Tags

Read MoreRead Less
Next Story