NATIONAL GAMES: జాతీయ క్రీడల్లో సత్తా చాటిన తెలంగాణ అమ్మాయి

NATIONAL GAMES: జాతీయ క్రీడల్లో సత్తా చాటిన తెలంగాణ అమ్మాయి
X
షూటింగ్ లో కాంస్యం.. ఏపీ వెయిట్ లిఫ్టర్ కు కాంస్యం

38వ జాతీయ క్రీడల్లో తెలంగాణ అమ్మాయి సురభి భరద్వాజ్ సత్తాచాటింది. 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌లో షూటర్ సురభి కాంస్య పతకం సాధించింది. స్టార్ షూటర్ సిఫ్ట్ కౌర్ 461.2 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం దక్కించుకోగా.. పంజాబ్‌కే చెందిన అంజుమ్ రజతం సాధించింది. ఫైనల్‌లో సురభి 448.8 స్కోరుతో మూడో స్థానంలో నిలిచింది. ఏపీ మహిళా వెయిట్‌లిఫ్టర్ సత్య జ్యోతి కాంస్యం గెలుచుకుంది.

ఏపీ వెయిట్ లిఫ్టర్ కూడా

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళా వెయిట్‌లిఫ్టర్ సత్య జ్యోతి కూడా కాంస్యం గెలుచుకుంది. 87+ కేజీల కేటగిరీలో ఆమె స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ విభాగాల్లో కలిపి మొత్తం 194 కిలోలు ఎత్తింది. పంజాబ్‌కు చెందిన మెహక్ శర్మ స్వర్ణం, ఉత్తరాప్రదేశ్‌కు చెందిన పుమిమా పాండే 216 రజతం సాధించారు. మరోవైపు, పారిస్ ఒలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్, స్టార్ షూటర్ సరబ్‌జోత్ సింగ్ పతకం గెలవలేకపోయాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్‌లో పాల్గొన్న అతను 4వ స్థానంతో సరిపెట్టాడు. ఫైనల్‌లో 198.4 స్కోరు చేశాడు. అయితే, కర్ణాటకకు చెందిన 15 ఏళ్ల జోనాథన్ ఆంటోనీ సంచలనం సృష్టించాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్‌లో నేషనల్ ఛాంపియన్‌గా నిలిచిన అతిపిన్న వయస్కుడిగా నిలిచాడు.



అభినందనలు తెలిపిన చంద్రబాబు

ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పురుషుల 67 కిలోల విభాగంలో నీలం రాజు, 71 కేజీల మహిళల విభాగంలో పల్లవి ఇప్పటికే స్వర్ణ పతకాలు గెలుపొందారు. తాజాగా 87 ప్లస్ కిలోల కేటగిరీలో విజయనగరం జిల్లాకు చెందిన టి.సత్యజ్యోతి విజయ ఢంకా మోగించారు. కాంస్యం పథకం సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. కాగా, ఇప్పుడు సత్యజ్యోతికి ప్రశంసలు వెల్లువలా వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ యువ క్రీడాకారిణిని అభినందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్లు చేశారు.

Tags

Next Story