Srikalahasthi : శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్‌పై జాతీయ మహిళా కమిషన్ సీరియస్..

Srikalahasthi : శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్‌పై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయింది. సీఐపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలని NCW ఛైర్ పర్సన్ రేఖాశర్మ ఆదేశించారు. ఈమేరకు ఏపీ డీజీపీకి రేఖాశర్మ లేఖ రాశారు. సీఐ చేతిలో గాయపడిన బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని లేఖలో పేర్కొన్నారు. మరోవైపు.. సీఐ అంజు యాదవ్ దాడి ఘటనపై అడిషనల్ ఎస్పీ విమలకుమారి స్పందించారు. సాక్షులను విచారిస్తున్నామని.. మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 15 మంది సాక్షులను విచారించామన్న ఏఎస్పీ.. ఘటనపై పూర్తి వివరాలతో ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. తప్పు ఎవరు చేసినా చట్టం తన పని తాను చేసుకునిపోతుందని విమలకుమారి చెప్పారు.
నాలుగు రోజుల క్రితం శ్రీకాళహస్తిలో ఓ డాబా విషయంలో సీఐ అంజు యాదవ్ కర్కశంగా ప్రవర్తించారు. డాబా యజమాని భార్య ధనలక్ష్మి దుకాణం వద్దకు వెళ్లి దాడి చేసిన సంఘటన తీవ్ర దుమారం రేపింది. బాధితులను నడిరోడ్డుపైనే సీఐ అంజు యాదవ్ కొట్టారు. దాంతో సామాన్య ప్రజల నుంచి అన్ని రాజకీయ పార్టీల వరకు తీవ్రంగా మండిపడ్డారు. ఈ సంఘటనపై విచారించేందుకు తిరుపతి ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి.. ప్రత్యేక విచారణ అధికారిగా అడిషనల్ ఎస్పీ విమలకుమారిని నియమించారు.శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్‌పై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయింది. సీఐపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలని NCW ఛైర్ పర్సన్ రేఖాశర్మ ఆదేశించారు.
ఈమేరకు ఏపీ డీజీపీకి రేఖాశర్మ లేఖ రాశారు. సీఐ చేతిలో గాయపడిన బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని లేఖలో పేర్కొన్నారు. మరోవైపు.. సీఐ అంజు యాదవ్ దాడి ఘటనపై అడిషనల్ ఎస్పీ విమలకుమారి స్పందించారు. సాక్షులను విచారిస్తున్నామని.. మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 15 మంది సాక్షులను విచారించామన్న ఏఎస్పీ.. ఘటనపై పూర్తి వివరాలతో ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. తప్పు ఎవరు చేసినా చట్టం తన పని తాను చేసుకునిపోతుందని విమలకుమారి చెప్పారు.
నాలుగు రోజుల క్రితం శ్రీకాళహస్తిలో ఓ డాబా విషయంలో సీఐ అంజు యాదవ్ కర్కశంగా ప్రవర్తించారు. డాబా యజమాని భార్య ధనలక్ష్మి దుకాణం వద్దకు వెళ్లి దాడి చేసిన సంఘటన తీవ్ర దుమారం రేపింది. బాధితులను నడిరోడ్డుపైనే సీఐ అంజు యాదవ్ కొట్టారు. దాంతో సామాన్య ప్రజల నుంచి అన్ని రాజకీయ పార్టీల వరకు తీవ్రంగా మండిపడ్డారు. ఈ సంఘటనపై విచారించేందుకు తిరుపతి ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి.. ప్రత్యేక విచారణ అధికారిగా అడిషనల్ ఎస్పీ విమలకుమారిని నియమించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com