Nellore: తమిళ జాలర్లు దాడి చేస్తున్న పోలీసులు పట్టించుకోవడం లేదు

నెల్లూరు జిల్లా ఇస్కపల్లి మెరైన్ పీఎస్ వద్ద శనివారం ఉద్రిక్తత నెలకొంది. స్టేషన్‌కు పెద్ద ఎత్తున మత్స్యకారులు చేరుకున్నారు. తమిళ జాలర్లు తమపై దాడి చేస్తున్న మెరైన్ పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. తమిళ జార్లు తమపై పదే పదే దాడి చేస్తున్న ఎందుకు స్పందించడం లేదని మెరైన్ ఎస్ఐ నాయబ్ రసూల్‌ను మత్స్యకారులు నిలదీశారు. తమిళ జాలర్లు నుంచి రక్షణ కల్పించాలంటూ మెరైన్ పోలీస్ స్టేషన్ ముట్టడించారు. ఇక మెరైన్ పోలీస్ స్టేషన్ తమ గ్రామానికి అవసరం లేదంటూ నినాదాలు చేశారు. మత్స్యకారుల ఆందోళనతో మెరైన్ పోలీస్ స్టేషన్ ముందు టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఉదయం ఇసుకపల్లి సముద్ర తీరంలో అలజడి చెలరేగింది. ఇసుకపల్లి మత్స్యకారులపై తమిళనాడు జాలర్లు దాడికి తెగబడ్డారు. తమిళనాడు కడలూరు బోట్లు ఆంధ్ర తీర ప్రాంతంలోకి చొచ్చుకొచ్చాయి. కడలూరు బోటు తగిలి ఇసుకపల్లి మత్స్యకారుల వలలు తెగిపోయాయి. ఇదేంటని ప్రశ్నించిన ఇసుకపల్లి జాలర్లపై తమిళ జాలర్లు రాళ్లదాడి చేశారు. దీంతో.. తమిళనాడు జాలర్లపై దాడి చేసేందుకు.. గాజు సీసాలు, రాళ్లను తీసుకుని ఇసుకపల్లి జాలర్లు సముద్ర జలాల్లోకి వెళ్లారు. ఈ ఘటనతో తీరం వెంబడి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com