Nellore : అదృశ్యమైన చిన్నారి... తిరిగి తల్లి చెంతకు

Nellore : అదృశ్యమైన చిన్నారి... తిరిగి తల్లి చెంతకు
పశువులు కాసేందుకు తండ్రి వెనుకాలే వెళ్లి..ఏడాదిన్నర క్రితం అదృశ్యమైన చిన్నారి అనూహ్యాంగా సోమవారం తల్లిదండ్రుల చెంతకు చేరాడు

పశువులు కాసేందుకు తండ్రి వెనుకాలే వెళ్లి..ఏడాదిన్నర క్రితం అదృశ్యమైన చిన్నారి అనూహ్యాంగా సోమవారం తల్లిదండ్రుల చెంతకు చేరాడు. దీంతో ఆ కన్నవారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఘటన నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఉయ్యాల పల్లిలో చోటు చేసుకుంది.

దండు బుజ్జయయ్, వరలక్ష్మమ్మలకు ముగ్గురు కుమారులు. వారిలో రెండో బిడ్డ అయిన సంజు..2021 జూన్ 29న ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చాడు. బుజ్జయ్య ఎప్పటిలాగే మేకలు తోలుకుని అడవికి వెళ్లగా..తండ్రిని అనుసరిస్తూ సంజు వెనుకాలే వెళ్లాడు. ఐతే ఈ విషయాన్ని బుజ్జయ్య గమనించలేదు. తర్వాత సంజు కనిపించకుండా పోయాడు. బిడ్డ ఎంతసేపటికి కనిపంచకపోవడంతో చుట్టుపక్కల గాలించారు. నాడు పోలీసులు కూడా నెల రోజుల పాటు అడవిని జల్లెడ పట్టారు. కానీ ఎలాంటి లాభం లేకపోయింది

ఐతే రాజంపేటకు చెందిన ఓ మహిళ...ఇటీవల కలువాయి మండలం తోపుగుంట ఎస్టీ కాలనీలోని బంధువుల ఇంటికి వచ్చింది. ఆమె వస్తూ ఓ బాలుడిని వెంట తీసుకువచ్చింది. చుట్టుపక్కల వాళ్లు ఆ బాబు ఎవరని ఆరా తీయగా..ఉయ్యాలపల్లి దగ్గర తన మరిదికి దొరికాడని చెప్పింది. తర్వాత ఆమె మళ్లీ పిల్లాడిని తీసుకుని రాజంపేట వెళ్లిపోయింది. ఐతే ఈ సమాచారం ఆదివారం బుజ్జయ్య దంపతులకు తెలిసింది. వారు తమ బిడ్డే అయి ఉండచ్చేమోనన్న ఆశతో రాజంపేటకు వెళ్లారు. అయితే వారు అక్కడి నుంచి ఇటుక తయారీ కోసం పామూరు వెళ్లినట్లు తెలిసింది. సోమవారం కృష్ణంపల్లి గ్రామంలో ఇటుకపని రాయి దగ్గరకు వెళ్లారు. బాలుడిని చూడగానే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తమ బిడ్డేనని గుర్తించి సంజును ఇంటికి తీసుకెళ్లారు బుజ్జయ్య దంపతులు.

Tags

Read MoreRead Less
Next Story