నెల్లూరు జిల్లాలో హల్ చల్ చేస్తున్న రౌడీలు

నెల్లూరు జిల్లాకు చెందిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. కొందరు దుండగులు.. ఇద్దరు యువకులపై విచక్షణా రహితంగా దాడిచేస్తున్న దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి. మొదటి వీడియోలో ఓ యువకుణ్ని మరో వ్యక్తి కర్రతో ఇష్టం వచ్చినట్లు కొడుతున్నాడు. అతను ఆర్తనాదాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇక రెండో వీడియోలో ఓ యువకుణ్ని... ఇద్దరు వ్యక్తులు చితకబాదుతున్నారు. మానవత్వం అన్నదే లేకుండా ఆ యువకులు దాడి చేస్తున్న దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. దుండగులకు బెట్టింగ్ మాఫియా అండదండులున్నాయని... వారే తరచూ ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని.. ఆరోపణలు వస్తున్నాయి.
అయితే దాడి జరిగిందంటూ తమకు మాత్రం ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పోలీసులు చెబుతున్నారు. సోషల్ మీడియాలోకి ఈ వీడియోలు ఎలా వచ్చాయి.. వాటి వెనక ఉన్న నిజానిజాలేంటి.. అన్నదానిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.