ఏపీలో కొత్తరకం కరోనా వైరస్‌ కలకలం.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఓ మహిళకు పాజిటివ్!

ఏపీలో కొత్తరకం కరోనా వైరస్‌ కలకలం.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఓ మహిళకు పాజిటివ్!
బ్రిటన్ నుంచి రాజమండ్రికి వచ్చిన మహిళకు కరోనా సోకిందా లేక జన్యు మార్పిడి అయిన కొత్త రకం వైరస్‌ వచ్చిందా అన్నది ఇంకా నిర్ధారించలేదు.

ఏపీలో కొత్తరకం కరోనా వైరస్‌ కలకలం రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. బ్రిటన్‌ నుంచి వచ్చిన మహిళకు కరోనా సోకినట్లు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అధికారులు ఆలస్యంగా నిర్థారించారు. సదరు మహిళను ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ అధికారులు క్వారంటైన్‌లో పెట్టారు. కానీ రిపోర్ట్‌ రాకముందే ఆమె అక్కడి నుంచి ఏపీ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కి రాజమండ్రికి వచ్చారు. దీంతో అలర్ట్‌ అయిన జిల్లా యంత్రాంగం మహిళకు, ఆమె కుమారుడికి పీపీఈ కిట్లు వేసి రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

బ్రిటన్ నుంచి రాజమండ్రికి వచ్చిన మహిళకు కరోనా సోకిందా లేక జన్యు మార్పిడి అయిన కొత్త రకం వైరస్‌ వచ్చిందా అన్నది ఇంకా నిర్ధారించలేదు అంటున్నారు వైద్య అధికారులు. మహిళ రక్త నమూనాలు సేకరించి పూణే ల్యాబ్‌కు పంపించారు. పరీక్షా ఫలితాలు వచ్చిన తరువాతే ఏ వైరస్ సోకిందన్నది చెబుతామని అధికారులు చెబుతున్నారు. మహిళ ట్రైన్‌లో రావడంతో అందులో ప్రయాణించిన వారికి కూడా కరోనా సోకిందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో రెండు ప్రత్యేక ఐసోలేషన్‌ గదులను ఏర్పాటు చేశారు. స్ట్రెయిన్ వైరస్ తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించి ఉంటుందని అనుమానిస్తున్న జిల్లా వాసులు భయాందోళన చెందుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story