విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. పాలిటెక్నిక్‌లో ఐదు కొత్త కోర్సులు..

ఏపీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలోని పలు ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్తగా ఐదు డిప్లొమా కోర్సులను ప్రవేశపెట్టేందుకు అనుమతించింది. వెబ్ డిజైనింగ్, 3 డీ యానిమేషన్ గ్రాఫిక్స్, యానిమేషన్-మల్టీమీడియా టెక్నాలజీ, ప్యాకేజింగ్ టెక్నాలజీ, సీఎస్సీ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) డిప్లొమా కోర్సులను ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తూ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, శిక్షణా శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని సెయింట్ మేరీస్ గ్రూప్ ఆప్ ఇనిస్టిట్యూషన్స్ 3 డీ యానిమేషన్ గ్రాఫిక్స్, యానిమేషన్-మల్టీమీడియా టెక్నాలజీ, వెబ్ డిజైనింగ్‌లో డిప్లొమా కోర్సులను ప్రవేశపెట్టడానికి అనుమతించింది. అలాగే తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం కిమ్స్ కాలేజీలో ప్యాకేజింగ్ టెక్నాలజీలో డిప్లొమా కోర్సును ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వగా, కోరంగి లోని కిమ్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ విమెన్‌లో 3-డి యానిమేషన్ గ్రాఫిక్స్ డిప్లొమా కోర్సును అనుమతించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com