LENCE: శాస్త్రవేత్తల మహాద్భుతం.... కళ్లు మూసుకున్నా చూసెయొచ్చు

ఆధునిక సాంకేతికత సాయంతో శాస్త్రవేత్తలు అద్భుతాలు చేస్తున్నారు. తాజాగా సైంటిస్టులు సృష్టించిన 'సూపర్-విజన్' ఇన్‌ఫ్రారెడ్ కాంటాక్ట్ లెన్స్ టెక్నాలజీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదో అద్భుత ఆవిష్క-రణ అంటూ అందరూ ట్వీట్స్ చేస్తున్నారు. దీని సాయంతో చీకట్లోనే కాదు. కళ్ళు మూసుకుని కూడా భేషుగ్గా చూసేయచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీనికి సంబంధించిన అధ్యయనం సెల్ జర్నల్‌లో ప్రచురితమైంది. చైనా సైన్స్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ అద్భుత ఆలోచనకు ప్రాణం పోశారు. సాంప్రదాయ కాంటాక్ట్ లెన్స్‌లలో కనిపించే పాలిమర్‌లను నానోపార్టికల్స్‌తో కలిపి చీకటిలో చూడటానికి వీలు కల్పించే లెన్స్‌లను రూపొందించినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ లెన్స్‌లకు సాధారణ నైట్-విజన్ గాగుల్స్ లాగా విద్యుత్ అవసరం లేదని కూడా అధ్యయనం చెబుతోంది. ఈ లెన్స్‌లు పారదర్శకంగా ఉంటాయి. వివిధ ఇన్‌ఫ్రారెడ్ ఫ్రీకెన్సీ గ్రహించే సామర్థ్యం ఉంటుంది. కాంటాక్ట్ లెన్స్‌లో ఉపయోగించే నానోపార్టికల్స్ ఇన్‌ఫ్రారెడ్ కాంతిని గ్రహించి క్షీరదాల కళ్ళకు కనిపించే ఫ్రీక్వెన్సీలోకి మారుస్తాయి. అందువల్ల ధరించిన వ్యక్తి ఇన్‌ఫ్రారెడ్, దృశ్య కాంతి రెండింటినీ ఒకేసారి చూడగలడు. ఈ లెన్స్‌లను మానవులపై ప్రయత్నించారు. వారు మినుకుమినుకుమనే పరారుణ కాంతిని గుర్తించి దాని దిశను గ్రహించగలిగారు. కళ్ళు మూసుకున్నప్పుడు తమ దృష్టి సామర్థ్యం మరింత పెరిగినట్లు పరిశోధనలో పాల్గొనేవారు వెల్లడించారని సైంటిస్టులు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com