AP: ఏపీలో రేపటి నుంచే కొత్త రేషన్‌ కార్డులకు దరఖాస్తులు

AP: ఏపీలో రేపటి నుంచే కొత్త రేషన్‌ కార్డులకు దరఖాస్తులు
X

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం మరో హామీని నెరవేర్చేందుకు సిద్ధమవుతోంది. తాము అధికారంలోకి వస్తే అర్హులైన పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేస్తామని కూటమి సర్కార్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. దీన్ని నెరవేర్చేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఈ క్రమంలో గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకుని కార్డులు రాని వారికి కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారితో పాటు కొత్త దరఖాస్తుదారులకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఏపీలో కొత్త రేషన్ కార్డులు పింఛన్లకు రేపటి(డిసెంబర్ 2) నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. సంక్రాంతి కానుకగా అర్హులుగా జనవరిలో కొత్త కార్డులు మంజూరు చేస్తారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లు కార్డులు అందించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించింది. కొత్త కార్డులపై పాలకుల పేరు లేకుండా రాజముద్రతో జారీ చేస్తుంది. దాదాపు 1.50 లక్షల కార్డులు ఇవ్వనుంది.


Tags

Next Story