గుంటూరు జిల్లా బాలుడు వినయ్ కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్

గుంటూరు జిల్లా బాలుడు వినయ్ కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన బాలుడు వినయ్ కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. తండ్రి మొబైల్ కొనివ్వలేదని స్నేహితులతో కలిసి బాలుడు కిడ్నాప్ డ్రామా ఆడాడు. మున్నా గ్యాంగ్ పేరుతో తొలుత రూ.10లక్షలు డిమాండ్ చేసిన స్నేహితులు.. తర్వాత రూ.50వేలు, చివరికి రూ.10వేలు ఇవ్వాలని అడిగారు. అనుమానంతో బాలుడు స్నేహితులను పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు.

సత్తెనపల్లికి చెందిన బట్టల వ్యాపారి వెంకటేశ్వర్లు కుమారుడు వినయ్ సోమవారం అదృశ్యమయ్యాడు. అదే రోజు రాత్రి సమయంలో కొంతమంది వ్యక్తులు తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అబ్బాయి మా వద్దే ఉన్నాడు.. విడుదల చేయాలంటే తమకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరించారు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విచారణ చేపట్టి నరసరావుపేట రోడ్డులోని వే బ్రిడ్జి వద్ద బాలుడిని గుర్తించి సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.


Tags

Read MoreRead Less
Next Story