రాత్రి 10 దాటితే రోడ్ల మీదకు రానివ్వం అంటున్న పోలీస్ బాస్‌లు

ఈ సారి న్యూఇయర్ సెలబ్రేషన్స్‌పై కఠిన ఆంక్షలు అమలవుతాయంటున్నారు పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో కొత్త ఏడాది వేడుకలకు అనుమతి ఇవ్వడం లేదు. ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే భారీ జరిమానాలు, శిక్షలు విధిస్తామని ముందే హెచ్చరిస్తున్నారు. పబ్బులు, క్లబ్బులు, బార్లు అనుమతించిన సమయం వరకే తెరచి ఉంటాయని స్పష్టం చేశారు. నిబంధనలు కఠినంగా అమలుచేస్తామంటున్న పోలీస్ బాస్‌లు.. కేరింతలు, వేడుకలు ఇంట్లోనే చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మందు కొట్టి వాహనాలు నడిపినా, యువత బైక్ రైడింగులు చేసినా.. భారీ జరిమానాలు, శిక్షలు వేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్‌లో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. బేగంపేట మినహా అన్ని ఫ్లైఓవర్లు మూసేస్తారు.
విశాఖలోనూ కొత్త ఏడాది వేడుకలపై ఆంక్షలు ఉన్నాయి. బీచ్ రోడ్డులో తిరగడానికి కూడా అనుమతించరు. రాత్రి 10 దాటితే రోడ్ల మీదకు రానివ్వం అంటున్నారు పోలీసులు. హోటళ్లలో ప్రత్యేక కార్యక్రమాలు పెట్టొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలో ప్రభుత్వ వైన్ షాపులు రాత్రి 9 గంటల వరకే ఉంటాయి. రాత్రి 11 దాటితే బార్ అండ్ రెస్టారెంట్స్ మూసేయాలని ఆదేశాలిచ్చారు. విజయవాడలోనూ కఠిన ఆంక్షలు అమలవుతాయి. ప్రార్థనా మందిరాలకు రాత్రి 1 వరకు అనుమతి ఉంటుందని, బెజవాడ ఫ్లైఓవర్లను మూసేస్తామని పోలీసులు చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com