పంచాయతీరాజ్ శాఖ తీరు బాధాకరం : ఎస్‌ఈసీ

హైకోర్టు ఆదేశాలతోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఎన్నికలను ఆపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని, కాని ప్రభుత్వ విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నామని నిమ్మగడ్డ తెలిపారు. సకాలంలో ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘంపై ఉందన్నారు. ఒకవేళ సుప్రీం కోర్టు తీర్పు వస్తే దానికి అనుగుణంగా పాటిస్తామన్నారు.
సీఎస్, డీజీపీ పరిణతి ఉన్న అధికారులని, సీఎస్, డీజీపీ సహా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు సాయంత్రం 3 గంటలకు నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనాలని చెప్పారు. విధి లేని పరిస్థితుల్లో 2019 ఓటర్ల జాబితాతోనే ఎన్నికల నిర్వహణ చేపట్టాల్సి వస్తోందని, కొత్త ఓటర్ల జాబితాను సిద్ధం చేయడంలో పంచాయతీరాజ్ కమిషనర్ అలక్ష్యంతో ఉన్నారని అన్నారు. పంచాయతీరాజ్ కార్యదర్శి, కమిషనర్‌పై సరైన సమయంలో చర్యలు ఉంటాయన్నారు. ఎస్‌ఈసీకి నిధుల కొరత, సిబ్బంది కొరత ఉందని చెప్పుకొచ్చారు.
తొలి దశలో విజయనగరం, ప్రకాశం జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో ఎన్నికలు ఉంటాయన్నారు. ఈ నెల 25 నుంచి అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. 27వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఉంటుందని చెప్పారు. 28న నామినేషన్ల పరిశీలన జరనుంది. 29న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలించనున్నారు. 30న ఆ అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. 31వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు విధించారు. ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com