సుబ్రహ్మణేశ్వర స్వామిని దర్శించుకున్న నిమ్మగడ్డ రమేష్!

సుబ్రహ్మణేశ్వర స్వామిని దర్శించుకున్న నిమ్మగడ్డ రమేష్!
కృష్ణా జిల్లా మోపిదేవిలోని సుబ్రహ్మణేశ్వర స్వామి వారిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ దర్శించుకున్నారు.

కృష్ణా జిల్లా మోపిదేవిలోని సుబ్రహ్మణేశ్వర స్వామి వారిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ దర్శించుకున్నారు. నిమ్మగడ్డకు పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. పుట్టలో పాలు పోసి పూజలు నిర్వహించారు. అనంతరం పెదకళ్లేపల్లి శ్రీ దుర్గానాగేశ్వర స్వామి ఆలయం, మొవ్వ గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం, శ్రీకాకుళంలోని శ్రీకాకులేశ్వరస్వామి ఆలయానికి నిమ్మగడ్డ వెళ్లనున్నారు. నిన్న మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Tags

Next Story