ఏపీ ఎన్నికల కమిషన్ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు

ఏపీ ఎన్నికల కమిషన్ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు
నిన్న జాయింట్ డైరెక్టర్ జీవీ సాయిప్రసాద్ ను విధుల నుంచి తొలగించిన రమేష్ కుమార్.. ఇవాళ ఎన్నికల సెక్రటరీ వాణి మోహన్ ను తొలగించారు

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేస్తున్న ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నారు. నిన్న జాయింట్ డైరెక్టర్ జీవీ సాయిప్రసాద్ ను విధుల నుంచి తొలగించిన రమేష్ కుమార్.. ఇవాళ ఎన్నికల సెక్రటరీ వాణి మోహన్ ను తొలగించారు. కమిషన్ నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకోవడం లేదనే కారణంతో ఆమెను రిలీవ్ చేశారు. ఈమేరకు ఆయన చీఫ్ సెక్రటరీ ఆదిత్య నాథ్ దాస్ కు లేఖ రాశారు. దీంతో రెండ్రోజుల వ్యవధిలో రెండో ఎన్నికల అధికారిపై వేటు పడింది.

జాయింట్ డైరెక్టర్ ముందస్తు సమాచారం లేకుండా సెలవుపై వెళ్లడం, మిగతా ఉద్యోగులను కూడా సెలవు పెట్టాలని ఒత్తడి చేయడంతో నిన్న ఆయన సస్పెండ్ అయ్యారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఎవరూ సెలవుపై వెళ్లొద్దని ఎస్ఈసీ రమేష్ కుమార్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కానీ జీవీ ప్రసాద్ 30 రోజుల పాటు సెలవు పై వెళ్లారు. దీంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఎన్నికల సంఘం క్రమశిక్షణారాహిత్యంగా పరిగణించింది.


Tags

Read MoreRead Less
Next Story